కీర్తి సురేష్ కి మహేష్ స్వాగ‌తం

హైదరాబాద్‌ : పరుశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న సర్కార్‌ వారి పాట సినిమాలో కీర్తి సురేష్‌ ఎంపికయ్యారు. మహా నటి సావిత్రితో జాతీయ అవార్డు పొందిన కీర్తి  ఈ రోజు (శనివారం)తో 29వ వసంతంలోకి అడుగుపెడుతోంది. పుట్టిన రోజు సందర్భంగా పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మహేష్‌ బాబు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ…సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. `టాలెంటెడ్‌ కీర్తి సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. `సర్కార్‌ వారి పాట` టీమ్ మీకు స్వాగతం పలుకుతోంది. ఈ సినిమా కచ్చితంగా మీ కెరీర్‌లో ఒక మంచి జ్ఞాపకంగా నిలుస్తుంద`ని మహేష్‌ ట్వీట్ చేశాడు. దీనిపై కీర్తి సురేష్‌ రిప్లై ఇచ్చారు. మీతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, షూటింగ్‌లో ఎప్పుడెప్పుడు పాల్గంటానా అని ఎదురుచూస్తున్నానని అన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.