కేంద్ర విద్యుత్ చట్టం ప్రమాదకరం
కేంద్ర విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ చట్టం చాలా ప్రమాదమని తెలంగాణ మాఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కేంద్ర ప్రతిపాదిత చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. కేంద్ర ప్రతిపాదిత చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. బిల్లును ఉపసంహరించుకోవాలని సభలో సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. “కేంద్రం తెచ్చే ఈ చట్టాన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని గుర్తచేశారు. కేంద్ర విద్యుత్ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ చట్టం 2003 సవరణ బిల్లును తెలంగాణ శాసనసభ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ర్టాల హక్కులను హరించే విధంగా, రైతులు, పేదల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఈ బిల్లు రూపకల్పన జరిగింది. ఈ చట్టం ద్వారా అధికారాలు ఢిల్లీకి వెళ్తాయని.. రాష్ట్రాల లోడ్ సంటెర్లు అన్నీ కేంద్రం వద్దకు వెళ్తాయని వివరించారు. ఇంకా సిఎం మాట్లాడుతూ.. కేంద్ర చట్టం ద్వారా రాష్ట్రంలో 26 లక్షల బోర్లకు మీటర్లు పెట్టాలి. కొత్త మీటర్ల కోసమే రూ. 700 కోట్లు కావాలి. ఈ బిల్లునుపార్లమెంటులో తీవ్రంగా వ్యతిరేకిస్తాం. నూతన చట్టం అమలులోకి వస్తే మీటర్ రీడింగ్ తీస్తారు.. బిల్లులు ముక్కుపిండి వసూలు చేస్తారు. ఈ కొత్త బిల్లుతో రాష్ట్రాలకు నియంత్రణ ఉండదు“ అని పేర్కొన్నారు. ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ నూతన విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ సిఎం కెసిఆర్ సభలో తీర్మనం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు మద్దతిచ్చాయి. అనంతరం కేంద్ర విద్యుత్ చట్టం బిల్లు ఉపసంహరణ తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
కేంద్ర విద్యుత్ చట్టంతో రైతులకు ఇబ్బందులు : మంత్రి జగదీష్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న విద్యుత్ చట్టంతో రైతులకు ఇబ్బందులు కలుగుతాయని రాష్ర్ట విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్ల%
Comments are closed.