కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు కరోనా పాజిటివ్

కైకలూరు: కృష్ణా జిల్లా కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం నాగేశ్వరరావు హైదరాబాద్ లోని అపొలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు ఆయన కుమారుడు వినరు తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్యం మెరుగ్గా ఉందని, ఎవ్వరూ ఆందోళన చెందకూడదని కోరారు.