చిరంజీవికి క‌రోనా పాజిటివ్‌

మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆచార్య షూటింగ్‌ ప్రారంభించాలని కరోనా టెస్ట్ చేయించుకున్నానని, ఫలితాల్లో పాజిటివ్‌గా తేలిందని ఆయన అన్నారు. ప్రస్తుతం తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తెలిపారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని పేర్కొన్నారు. గత 4-5 రోజులుగా తనను కలిసిన‌ వారు టెస్ట్ చేయించుకోవాలని చిరంజీవి కోరారు. అంతేకాదు ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిని చెబుతానని ఫ్యాన్స్‌కి భరోసా ఇచ్చారు.

”ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్  క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను” అని ట్విట్ చేసారు మెగాస్టార్.

అయితే చిరు మొన్న తెలంగాణ సీఎం కేసిఆర్ ను కలిశారు. మరో హీరో నాగార్జున తో కలిసి ప్రగతి భవన్ వెళ్లారు చిరు. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఆచార్య షూటింగ్ ఈ రోజు ప్రారంభం కావాల్సింది. కానీ ఇప్పుడు ఆగిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

 

Leave A Reply

Your email address will not be published.