కొత్తగా 14,199 కొత్త కేసులు.. 9,695 రిక‌వ‌రీలు..

దేశంలో పెగుగుతున్న కేసులు..

న్యూఢిల్లీ: ఈ మ‌ధ్య కాలంలో క‌రోనా కేసుల్లో పెరుగుద‌ల దేశ ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 6,20,199 మందికి క‌రోనా నిర్ఢార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 14,199 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో వరుసగా రెండో రోజూ 14 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,05,850కి చేరింది. ఇందులో 1,06,99,410 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో 1,50,055 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గ‌త 24 గంట‌ల్లో కరోనా వల్ల మరో 83 మంది మృతిచెందారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 1,56,385 మహమ్మారి వల్ల మరణించారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 9,695 మంది కొత్తగా డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Leave A Reply

Your email address will not be published.