కొత్త ర‌కం క‌రో‌నా అదుపులోనే..: డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: బ్రిట‌న్‌లో బెంబేలెత్తిస్తున్న కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ అదుపులోనే ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న విధానాల‌తో ఆ వైర‌స్ దూకుడును అడ్డుకోవ‌చ్చు అని డ‌బ్ల్యూహెచ్‌వో చెప్పింది. కొత్త వైర‌స్ వ్యాప్తి రేటు అధికంగానే ఉన్నా.. ప్ర‌స్తుతానికి మాత్రం కంట్రోల్‌లోనే ఉన్న‌ద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో ఎమ‌ర్జెన్సీ చీఫ్ మైఖేల్ ర్యాన్ తెలిపారు. అదుపులోనే ఉందంటే.. దాన్ని అలాగే వ‌దిలేయ‌లేమ‌ని ఆయ‌న అన్నారు. బ్రిట‌న్ ఆరోగ్య‌శాఖ మంత్రి మాట్ హాన్‌కాక్ కొత్త వైర‌స్ గురించి ఇటీవ‌ల హెచ్చ‌రిక చేసిన విష‌యం తెలిసిందే. కొత్త ర‌కం క‌రోనా అదుపు త‌ప్పిన‌ట్లు ఆయ‌న అన్నారు. ప్ర‌ధాన వైర‌స్ స్ట్రెయిన్ క‌న్నా.. కొత్త ర‌కం క‌రోనా సుమారు 70 శాతం వేగంగా విస్త‌రిస్తున్న‌ట్లు మంత్రి మాట్ హాన్‌కాక్ తెలిపారు. ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న వైర‌స్ నియంత్ర‌ణ ఆంక్ష‌లు క‌రెక్ట్‌గా ఉన్నాయ‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.