కోవిడ్‌ నుంచి కోలుకున్న బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా

న్యూఢిల్లీ: ఇప్పటికే భారత్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు కోటి దాటేశాయి. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో సామాన్యుల నుండి కేంద్ర మంత్రులు, పార్టీ నేతలు, సీఎంలు.. ఇలా చాలా మంది కరోనా బారినపడ్డారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఆయన కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా జేపీ నడ్డా స్పందించారు.

కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని తన గురించి ప్రార్థించిన వారికి, నైతిక మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.. అలాగే.. ప్రస్తుతం తాను, తన కుటుంబ సభ్యులంతా పూర్తిగా కోలుకున్నామని వెల్లడించిన ఆయన.. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ ఎంతో నిబద్ధతతో వైద్యం అందించిన ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియాకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు..

 

Leave A Reply

Your email address will not be published.