కోవిడ్-19 సంక్షోభంలోనూ.. తరగని కుబేరుల సంపద
ఫోర్బ్స్ ప్రకటించిన ఇండియా సంపన్నుల లిస్ట్
ముంబయిః భారత్‌లో వందమందితో కూడిన అత్యంత సంపన్నల జాబితాలో రిలయన్స్ ఇండస్ర్టీస్ అధిపతి, కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ మరోసారి అగ్రస్ధానంలో నిలిచారు. 8,800 కోట్ల డాలర్ల సంపదతో ముఖేష్ 2020 సంవత్సరానికి ఫోర్బ్స్ ఇండియా జాబితాలో నెంబర్ వన్ ర్యాంక్‌ను మళ్లీ నిలుపుకున్నారు. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ గత 13 సంవత్సరాలుగా మొదటి ర్యాంక్‌లో కొనసాగడం గమనార్హం. ఇక అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ 2500 కోట్ల డాలర్ల సంపదతో ఫోర్భ్స్ ఇండియా జాబితాలో ముఖేష్ తర్వాతి స్ధానంలో నిలిచారు. ఈ ఏడాది ముఖేష్ అంబానీ సంపదకు తాజాగా 375 కోట్ల ఆస్తులు అదనంగా తోడయ్యాయని ఫోర్బ్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఆయన సంపద 73 శాతం పెరిగింది. 2017లో 37వ స్థానంలో వున్ ముకేశ్ అంబానీ… 2018లో 19వ స్థానానికి, 2019లో 13వ స్థానానికి తన ర్యాంకును పెంచుకున్నారు. గౌతమ్ అదానీ తన నికర ఆదాయ విలువ 61 శాతం పెరగడంతో ఆయన సంపద 25.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతీయ విమానాశ్రయాలకు అధిపతి కావాలని ఆశించిన అదానీ 2020 లో ముంబై విమానాశ్రయంలో 74 శాతం వాటాను సొంతం చేసుకున్నారు. హెచ్‌సిఎల్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు, టెక్ దిగ్గజం శివ్ నాదర్మూ డు స్థానాలు ఎగబాకి 20.4 బిలియన్ డాలర్లతో 3వ స్థానానికి చేరుకున్నారు. నాలుగవ స్థానం 15.4 బిలియన్ డాలర్ల ఆస్తిని కలిగి ఉన్న డి మార్ట్ అధినేత రాధాకిషన్ దమాని సొంతంచేసుకున్నారు.
ఇక టాప్- 100 సంపన్నులలో మహిళలు ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఓపి జిందాల్ గ్రూపుకు చెందిన సావిత్రి జిందాల్ 6.6 బిలియన్ డాలర్ల ఆస్తులతో 19 వ స్థానంలో ఉన్నారు. బయోకాన్ కు చెందిన కిరణ్ మజుందార్ షా 4.6 బిలియన్ డాలర్ల ఆస్తులతో 27 వ స్థానంలో వున్నారు.. 3 బిలియన్ డాలర్ల ఆస్తులతో యుఎస్‌వికి చెందిన లీనా తివారీ 47 వ స్థానంలో నిలిచారు. కాగా, ఈ సంవత్సరం జాబితాలో తొమ్మిది మంది కొత్తవారు ఉన్నారు. వాటిలో సంజీవ్ బిఖ్‌చందాని, 2.1 బిలియన్ డాలర్లతో, ఇన్ఫో ఎడ్జ్ ఇండియా కోఫౌండర్, బంధువులు నితిన్, నిఖిల్ కామత్, 1.55 బిలియన్ డాలర్లతో 90 స్థానంలో ఉన్నారు. కొత్తగా ఈ జాబితాలో ప్రవేశించిన వారిలో ముగ్గురు స్పెషాలిటీ కెమికల్స్ ఉత్పత్తిదారులున్నారు. వినాటి ఆర్గానిక్స్ వ్యవస్థాపకుడు వినోద్ సారాఫ్ 1.4 బిలియన్ డాలర్లతో 95 స్థానంలో ఉండగా, ఆయన సోదరులు చంద్రకాంత్, రాజేంద్ర గోగ్రి 1.39 బిలియన్డా లర్లతో 96వ స్థానంలో నిలిచారు. ఆర్తి ఇండస్ట్రీస్, ఎస్ఆర్ఎఫ్ సంస్థ అధినేత అరుణ్ భారత్ రామ్ 1.34 బిలియన్ డాలర్లతో 99వ స్థానంలో వున్నారు.
కాగా కోవిడ్-19 నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది కుదేలైనా భారత్‌లో అత్యంత కుబేరులు తమ సంపదను కాపాడుకున్నారని ఫోర్భ్స్ వ్యాఖ్యానించింది. ముఖేష్ అంబానీ వరుసగా 13వ సారి భారత్‌లో అత్యంత సంపన్నుడిగా నిలిచారని, వ్యాక్సిన్ తయారీదారు సైరస్ పూనావాలా ఆరో ర్యాంక్‌ను సాధించి టాప్ 10లో చోటు సంపాదించారని నివేదిక వెల్లడించింది.
టాప్ -10 భారతీయ ధనవంతులు:
-
ముఖేష్ అంబానీ: 88.7 బిలియన్ డాలర్లు
-
గౌతమ్ అదానీ: 25.2 బిలియన్ డాలర్లు
-
శివ నాదర్: 20.4 బిలియన్ డాలర్లు
-
రాధాకిషన్ దమాని: 15.4 బిలియన్ డాలర్లు
-
హిందూజా సోదరులు: 12.8 బిలియన్ డాలర్లు
-
సైరస్ పూనవల్లా: 11.5 బిలియన్ డాలర్లు
-
పల్లోంజి మిస్త్రీ: 11.4 బిలియన్ డాలర్లు
-
ఉదయ్ కోటక్: 11.3 బిలియన్ డాలర్లు
-
గోద్రేజ్ కుటుంబం: 11 బిలియన్ డాలర్లు
-
లక్ష్మి మిట్టల్: 10.3 బిలియన్ డాలర్లు