క్రికెట్‌కు యూసుఫ్ ప‌ఠాన్ వీడ్కోలు

టీమిండియా ఆల్ రౌండ‌ర్ యూసుఫ్ ప‌ఠాన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల‌కు ‌రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఈ విష‌యాన్ని శుక్ర‌వారం ట్విట‌ర్ వేదిక‌గా తెలియ‌జేశాడు. అలాగే ఇప్పటి వరకూ తనకు అండగా నిలిచిన దేశానికి, కుటుంబానికి, స్నేహితులు, అభిమానులు, కోచ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాగే ప్రోత్సహించాలని కోరారు. అనంతరం భావోద్వేగపూరితంగా వ్యాఖ్యానించారు. తొలిసారి టీమ్‌ఇండియా జట్టు జెర్సీ ధరించడం, సచిన్‌ను భుజాలపై మోయడం, 2007 టీ 20, 2011 వన్డే ప్రపంచకప్‌లు గెలవడం, ఇవన్నీ తన కెరీర్‌లో గొప్ప క్షణాలని తెలిపారు.

భార‌త్ త‌ర‌ఫున యూసుఫ్ పఠాన్ 57 వ‌న్డేలు, 22 టీ20లు ఆడాడు. 57 వన్డేల్లో 810 పరుగులు, 33 వికెట్లు… 22 టీ20 మ్యాచుల్లో 236 పరుగులు, 13 వికెట్లు పడగొట్టారు టీమిండియా గెలిచిన‌ 2007, 2011 వ‌రల్డ్ క‌ప్ జ‌ట్టులోనూ యూసుఫ్ ప‌ఠాన్ సభ్యుడు. టీమిండియాకి 2012 మార్చి 30లో చివ‌రిసారి మ్యాచ్ ఆడిన యూసుఫ్ ప‌ఠాన్‌.. ఆ త‌ర్వాత ఐపీఎల్‌, దేశవాళీ క్రికెట్‌కే ప‌రిమిత‌మయ్యాడు. కాగా టీమిండియా పేసర్‌ ఆర్‌. వినరుకుమార్‌ కూడా శుక్రవారమే రిటైర్మెంట్‌ ప్రకటించారు.

 

Leave A Reply

Your email address will not be published.