కరోనాను జయించిన 107 యేళ్ల బామ్మ
జల్నా: శత్రువు ఎంత బలవంతుడైన.. మనో ధైర్యం బలంగా ఉంటే విజయం మనదే.. అని ఎన్నోసార్లు నిరూపితమైంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను నూరేళ్లుదాటిన బామ్మం జయించింది. ఇది వినడానికి ఇంతో అద్భుతంగా ఉంది. కానీ ఇది నిజం.. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో మలిపురలో నివాసముంటున్న 107 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. అందులోనూ 10 రోజుల్లోనే ఆమె కరోనా నుండి కోలుకోవడం గమనార్హం. ఇటీవల ఆమె వెన్నుముకకు శస్త్రచికిత్స జరిగింది. అయినప్పటికీ ఈ బామ్మ కరోనా వైరస్ బారి నుంచి బయటపడింది. వయస్సు మీరిన వ్యక్తులపైన కరోనా తీవ్ర ప్రభావం చూపుతుందని, చనిపోయే వారిలో వీరే ఎక్కువ మంది ఉంటున్నారనే వార్తల నేపథ్యంలో ఈ బామ్మ కరోనాను జయించడం అద్బుతంగా చెబుతున్నారు. ఆమెకు మాత్రమే కాక ఆమె కూతురు, కొడుకు, ఇద్దరు మనవళ్లు కూడా కరోనా బారిన పడ్డారు. అందరూ కూడా పదిరోజుల్లోనే కోలుకోని ఇంటికొచ్చారు. ఆమె కోలుకుంటుందనే ఆశ తమకు లేదని, కానీ వైద్యుల కృషి కారణంగా తన అమ్మ తిరిగి ఇంటికొచ్చిందని ఆమె కొడుకు అన్నారు. ఏది ఏమైనా 107 యేళ్ల బామ్మతో పాటు కుటుంబ సభ్యులు అంతా కరోనాను జయించడం అందరికి ఆర్శంగా నిలుస్తున్నారు.