కరోనా ఎఫెక్ట్: నాగపూర్ లో స్కూళ్లు బంద్
నాగ్‌పూర్: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి.దాంతో దేశంలోని పలురాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి ఇప్పటి మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్ పలు జాగ్రత్తలు తీసుకున్నాయి ముఖ్యంగా మహారాష్ట్రలోని అమరావతి, యావత్మల్ జిల్లాల్లో లాక్ డౌన్ విధించారు. అలాగే పుణేలో నైట్ కర్ఫ్యూ కూడా విధించారు. వీటితో పాటు మహారాష్ట్రలోని ముఖ్యనగరమైన నాగ్‌పూర్‌లో కూడా కరోనా విజృంభిస్తోంది. దాంతో మార్చి 7 వ తేదీ వరకు స్కూళ్ళు, కాలేజీలను మూసేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇవాళ (మంగళవారం) సాయంత్రం రాష్ట్రంలో కరోనా విజృంభణపై ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే సమీక్ష చేయనున్నారు.