క‌రోనా టీకా తీసుకున్న అమితాబ్

ముంబ‌యి: బాలీవుడ్ అగ్ర న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ క‌రోనా వాక్సిన్ తీసుకున్నాడు. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా ట్విట్ట‌ర్ లో పోస్టు చేశారు. గురువారం రాత్రి అమితాబ్‌ ట్వీట్ చేస్తూ.. గురువారం మ‌ధ్యాహ్నం త‌న కొవిడ్ వ్యాక్సినేష‌న్ తీసుకోవ‌డం పూర్త‌యింద‌ని తెలిపారు. ఇప్పుడు సుర‌క్షితంగా ఉన్న‌ట్లు ఆయ‌న‌ పేర్కొన్నారు. గ‌తేడాది బిగ్ బీకి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో ముంబ‌యిలోని నానావ‌తి ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందిన సంగ‌తి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.