గంటా శ్రీనివాసరావు రాజీనామా
అమరావతి: విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గంటా తన రాజీనామా లేఖను ఆంధ్రప్రదేశ్ శసనసభాపతి తమ్మినేని సీతారామ్‌కు పంపారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం 100 శాతం ప్రైవేట్‌పరం చేస్తున్నట్లు ప్రకటించడాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు లేఖలో ఆయన పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమే తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోవాలని డియాండ్ చేశారు.
`విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోవాలి. విశాఖ ఉక్కు కర్మాగారం దేశంలోని మిగతా కర్మాగారాల లాగా కేవలం ఒక పరిశ్రమ గా మాత్రమే చూడొద్దు. విశాఖ ఉక్కు మా ఆత్మ గౌరవం, మా విశాఖ ప్రజల ఉఛ్వాస నిశ్వాస. మా నగరం పేరే ఉక్కు నగరం.
కాబట్టి వెంటనే సొంత ఐరన్ మైన్ ని కేటాయించాలని మా డిమాండ్. అలా కాదని ముందుకెళ్తే ఢిల్లీ లో జరుగుతోన్న రైతు ఉద్యమం కంటే 100 రేట్ల పెద్ద ఉద్యమాన్ని, తీవ్రతని చవిచూడాల్సి ఉంటుంది.` అని గంటా ట్వీట్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోవాలి. విశాఖ ఉక్కు కర్మాగారం దేశంలోని మిగతా కర్మాగారాల లాగా కేవలం ఒక పరిశ్రమ గా మాత్రమే చూడొద్దు. విశాఖ ఉక్కు మా ఆత్మ గౌరవం, మా విశాఖ ప్రజల ఉఛ్వాస నిశ్వాస. మా నగరం పేరే ఉక్కు నగరం. pic.twitter.com/l0gg7gT3kk
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) February 5, 2021