గడచిన 24 గంటల్లో 1096 మంది మృతి

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసుల్లో పెరుగుల రికార్డులు నమోదు చేస్తోంది. భారత్‌లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడం లేదు. తొలుత కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న స్పెయిన్, అమెరికా, బ్రెజిల్‌లో కరోనా ప్రభావం రానురాను తగ్గిపోగా భారత్‌లో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. భారత్‌లో గడచిన 24 గంటల్లో 83,341 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39 లక్షలు దాటింది. భారీ స్థాయిలో కేసుల నమోదును బట్టి చూస్తే రేపటికల్లా భారత్‌ బ్రెజిల్‌ను దాటేసి రెండో స్థానానికి ఎగబాకనుంది. 40,46,150 కేసులతో బ్రెజిల్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. 63,35,244 కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల్లో 1,096 మంది మృతి చెందడంతో ఆ సంఖ్య 68,472కు చేరింది. కరోనా బారి నుంచి ఇప్పటివరకు 30,37,152 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 8,31,124 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. ప్ర‌స్తుతం క‌రోనా బాధితుల రిక‌వ‌రీ రేటు 77శాతం దాటింది. మ‌ర‌ణాల రేటు 1.7 శాతంగా ఉంది.

 

 

 

Leave A Reply

Your email address will not be published.