గత 24 గంటల్లో 93,337 కరోనా కేసులు
భోపాల్‌లో మరణాల్లో 60 % మంది భోపాల్ గ్యాస్ బాధితులే
న్యూఢిల్లీ : భారత్‌తో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 93,337 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం బాధితులసంఖ్య 53,08,015 చేరింది. అయితే రికవరీ రేటు సైతం భారీగానే నమోదవుతుంది. గడిచిన 24 గంటల్లో 1247 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 85,619కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 42,08,432కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య10,13,964గా ఉంది. దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 19.52 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 78.86 శాతానికి పెరగ్గా, మరణాల రేటు 1.62 శాతానికి పడిపోయిందని కేంద్రం తెలిపింది.
కరోనా మరణాల్లో 60 శాతం మంది భోపాల్ గ్యాస్ బాధితులే
1984 నాటి భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఇంకా అక్కడి ప్రజలను వెంటాడుతోంది. ఇటీవల భోపాల్‌లో కోవిడ్‌తో మరణించిన వారిలో 60 శాతం మంది భోపాల్ దుర్ఘటన బాధితులేనని తేలింది. గత 15 రోజుల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. అయితే భోపాల్ గ్యాస్ బాధితులకు చికిత్స అందించేందుకు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఐసిఎంఆర్) ఆధ్వర్యంలో నడుస్తున్న భోపాల్ మెమొరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వ్యవహార శైలిని సుప్రీంకోర్టు నియమించిన మానిటరింగ్ కమిటీ ‘సర్వైవర్ గ్రూప్’ విమర్శించింది. ఆరుగురు చనిపోవడంపై స్పందిస్తూ కోవిడ్-19 బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు అక్కడ సరైన వైద్యులు లేరని, యాజమాన్యం సరిగా లేదని ఇది నేరపూరిత చర్యగా పేర్కొంది. ఆరుగురు చనిపోవడంపై సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. మా లేఖపై ఐసిఎంఆర్ సరైన చర్యలు తీసుకుంటే తప్ప సమస్య పరిష్కారమవ్వదని, అనేక మంది భోపాల్‌కు చెందిన వారు కరోనా బారిన పడి..మృతి చెందుతున్నారని, అంతేకాకుండా చెవిటి వారవుతున్నారని వారి సర్వేలో తేలిందని భోపాల్ గ్యాస్ పీడిత్ మహిళ పరుష్ సంఘర్ష్ మోర్చాకు చెందిన నవాబ్ ఖాన్ తెలిపారు. ప్రతిచోట నుంచి కోవిడ్-19 సమాచారాన్ని తీసుకునే సమయంలో ఎంతో బాధను అనుభవించామని, ఇందులో 60 శాతం మందికి పైగా మరణాల్లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులన్నారని, ఇప్పటికి…నగరంలో వీరు 25 శాతం మంది మాత్రమే బతికి ఉన్నట్లు పేర్కొన్నారు. కోవిడ్-19తో సహా గ్యాస్ బాధితులు భోపాల్ ఆసుపత్రుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా ఐసియు అవసరం ఉన్న రోగులు లేదా న్యూరాలజీ, గ్రాస్టో, న్యూరో సర్జరీ, ఊపిరితిత్తులకు సంబంధించిన రోగులకు ఆసుపత్రిలోకి రానివ్వడం లేదని సర్వైవర్ గ్రూప్ తెలిపింది.