గవిచర్ల వద్ద ప్రయాణికులతో సహా బావిలో పడ్డ జీపు
వరంగల్: జిల్లాలోని సంగెం మండలం గవి చర్ల వద్ద ప్రమాదం సంభవించింది. వరంగల్ నుంచి నెక్కొండకు ప్రయాణికులతో వెళ్తున్న జీపు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకు వెళ్లింది. ఈ జీపులో 15 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. వీరిలో 11 మంది బావిలో నుంచి ఒడ్డుపైకి రాగా మిగిలినవారు జీపులోనే ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ఘటనా స్థలానికి మామునూరు ఎసిపి శ్యామ్‌సుందర్, పర్వతగిరి సిఐ కిషన్ చేరుకున్నారు. జెసిబి సాయంతో జీపును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాద వార్త తెలిసిన చుట్టుపక్కలవారు భారీగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



[…] గవిచర్ల వద్ద ప్రయాణికులతో సహా … […]