ఘనంగా బాలల ప్రతిభా అవార్డులు – 2020

హైదరాబాద్: రోటరీ కమ్యూనిటీ కార్ప్స్ ఆఫ్ అథ్మా బాలల ప్రతిభ అవార్డుల2020 ప్రదానోత్సవం ఘనంగా హైదరాబాద్ లో జరిగింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నవంబరు 14 బాలల దినోత్సవం సందర్బంగా పలు రకాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పిల్లల కోసం వివిధ సరదా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ పోటీలలో పలువురు విద్యార్థులు వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారు ఆన్‌లైన్‌లో వారి ఎంట్రీలను పంపారు. దీనిలో నర్సరీ నుండి 10 వ తరగతి వరకు దాదాపు 1500 మందికి పైగా బాలలు పాల్గొన్నారు. అన్ని విభాగాల నుండి మొత్తం 50 మందికి అవార్డులు లభించాయి. కరోనా సమయంలో బడులు తెరుచుకోక ఇంట్లోనే ఉంటూ కేవలం ఆన్‌లైన్ పాఠాలు విటూ… వినోదాలు, క్రీడలకు దూరంగా ఉంటున్న పిల్లల కోసం ఆన్‌లైన్‌లో ఈ పోటీలను నిర్వహించడం పట్ల పలువురు విద్యార్థులు, తల్లదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.


సూపర్