చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్ : టిపిడి అధినేత చంద్రబాబు నాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వారుకి ఆవు అడ్డురావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దీంతో కాన్వారులోని రెండు మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న వాహనం బుల్లెట్ ప్రూఫ్ కావడంతో ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. సిబ్బందికి స్వల్ప గాయాలు కావడంతో మరో వాహనంలో వారిని తరలించారు. ఈ ఘటనలో చంద్రబాబు క్షేమంగా ఉన్నారు.