చిరంజీవిని సర్‌ప్రైజ్ చేసిన మనవరాలు
మెగాస్టార్ చిరంజీవికి సోషల్ మీడియాలోకి వచ్చాక ఏదో ఒక రకంగా అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఆయనకు ఏది నచ్చినా అభిమానులతో షేర్ చేసుకోవడం తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కుమార్తె సంహిత తన కళను ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచింది. రుద్రమదేవి సినిమాలోని డైలాగ్‌ను గాంభీర్యం తగ్గకుండా హావభావాలు ఒలికిస్తూ, అక్షరం పొల్లుపోకుండా చెప్పింది. డైలాగ్ చెప్పే తీరు, ఆ దర్పం, యాక్షన్ చూసి మెగాస్టార్ సర్‌ప్రైజ్ అయ్యారు. ముద్దుముద్దుగా డైలాగ్ చెప్పిన మనవరాలి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

“1990లో సుష్మిత, 2020లో సంహిత పరంపర కొనసాగుతోంది. అచ్చంగా తల్లిలాగే కూతురు“ అని తెలుపుతూ.. ఓ మెస్మరైజింగ్ వీడియోని చిరు షేర్ చేశారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూతురు సంహిత సంబంధించిన వీడియో అది. రాణీ రుద్రమదేవి అవతారంలో ఆమె చెప్పిన డైలాగ్ చెబుతూ.. సంహిత పలికిన పలుకులకు చిరంజీవి ఎంతో మురిసిపోయినట్లుగా తెలుపుతూ ఈ వీడియోని షేర్ చేశారు. అంతే కాదు 1990లో తన కూతురు సుస్మిత కూడా రాణీ రుద్రమ్మ అవతారం ధరించిందని.. ఇప్పుడు సంహిత ఆ పరంపరను కొనసాగిస్తున్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. చివరిగా తన మనవరాలి అభినయానికి మురిసిపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మెగాస్టార్ మనవరాలా.. మజాకా! అంటూ సంహితను తెగ పొగిడేస్తున్నారు.