‘చిరంజీవి’వై వర్ధిల్లుగాక: మోహన్ బాబు

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు(ఆగస్ట్ 22). ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు చిరంజీవికి ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు అభినందనలు తెలిపారు. ‘‘చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్ చిరంజీవి’’ అని అభినందనలు తెలియజేస్తూ డైలాగ్ కింగ్ మోహన్బాబు చిరంజీవితో ఉన్న ఓ ఫొటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఇండస్ట్రీలో నా ప్రియమైన మిత్రుడు చిరంజీవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు – వెంకటేశ్

చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్ని జనరేషన్స్ కు మీరొక స్ఫూర్తి. ఇలాగే కొనసాగాలి ఎప్పుడూ.. మీరెప్పుడు ఆరోగ్యం, సంతోషంతో ఉండాలి సర్. – మహేష్ బాబు

మెగస్టార్ చిరంజీవిగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటిపుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా సర్ – ఎన్టీఆర్

మన వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్కి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన పట్ల నాకు ఎల్లప్పుడూ గౌరవం, కృతజ్ఞత ఉంటాయి. ఆయనే నా నిజమైన ‘ఆచార్య’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.

తన ‘ఆచార్య’ చిరంజీవేనంటూ వరుణ్ తేజ్ కూడా ట్వీట్ చేశాడు. చిరు నా బెస్ట్ ఫ్రెండ్.. ఆయన ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలని నేను కోరుకుంటాను. హ్యాపీ బర్త్ డే చిరంజీవి’ అని సీనియర్ నటి రాధిక పేర్కొన్నారు. ‘వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ సినీనటుడు సునీల్ ట్వీట్ చేశాడు.

‘మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ అద్భుతమైన నటనా కౌశలంతో ప్రేక్షకులను మరింతగా అలరించాలని ఆశిస్తున్నాను. ప్రజలకు సేవ చేయడానికి మీకు ఆయురారోగ్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీ కెరీర్లో మరిన్ని గొప్ప మైలురాళ్లు అందుకోవాలని ఆశిస్తున్నాను’ అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.