చైనాలో నూడుల్స్ తిని 9 మంది మృతి

బీజింగ్: చైనీస్ వంటకం నూడుల్స్ కు సంబంధించి ఓ షాకింగ్ వార్త వెలుగులోకి నెట్లో ఇప్పుడు హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సభ్యులు నూడుల్స్ తిని మృత్యువాత పడ్డారు. అక్కడి హెయిలాంగ్జియాన్ ఫ్రావిన్స్, జిడాంగ్ కౌంటీలో నూడుల్స్ తిన్న తొమ్మిది మంది చనిపోయినట్లు చైనీస్ అధికారిక మీడియా ప్రకటించింది. ఏడాది క్రితం చేసిన నూడిల్స్‌ను తినడమే ఇందుకు కారణం. ఏడాది క్రితం ఇంట్లో నూడుల్స్ వండుకున్నారు. కారణం ఏంటో తెలియదు కానీ, దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఏడాది పాటు అలాగే వదిలేశారు. ఏడాది తర్వాత కుటుంబ సభ్యులంతా తలో చేయి వేద్దాం అన్నట్లుగా తిన్నారు. పులియబెట్టిన మొక్కజొన్న పిండితో చేసిన ఈ నూడుల్స్‌ను యేడాది పాటు ఫ్రిజ్‌లో పెట్టడంతో దాంట్లో బోంగ్రెకిక్ ఆసిడ్ అనే విష పదార్థం తయారైంది. దీనిని చైనాలో ఉద‌యం అల్పాహారంగా తీసుకుంటారు. జిడాంగ్ కు చెందిన 12 మంది సభ్యుల కుటుంబం అక్టోబర్ 5న బ్రేక్ ఫాస్ట్ గా నూడుల్స్ సూప్ ను తీసుకున్నారు. దాని రుచి అదోలా ఉండటంతో ముగ్గురు మాత్రం నూడుల్స్ తినకుండా వదిలేశారు. తిన్న 9మంది గంటల వ్యవధిలోనే ఒకరితర్వాత ఒకరుగా ఆస్పత్రిపాలయ్యారు. సోమవారం నాటికి తొమ్మిదో వ్యక్తి చనిపోయారు. కాగా ఈ ఘ‌ట‌న‌పై నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) అప్రమత్తమైంది. ప్రజలెవరూ పులియబెట్టిన నూడుల్స్ ను తినొద్దని, ఇంట్లో నిల్వఉంచిన అలాంటి పదార్థాలను వెంటనే చెత్తబుట్టలో పారేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.