చైనా, పాక్‌తో ఏకకాలంలో తలపడడానికి సిద్ధం

 ఎయిర్ చీఫ్ భ‌దౌరియా

న్యూఢ్లీ: చైనా, పాకిస్తాన్ తో ఏకకాలంలో యుద్ధం చేయడానికి భారత వైమానిక దళం రెడీగా ఉందని చీఫ్ ఆర్.కే. బధూరియా సోమవారం ప్రకటించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా తాము గట్టి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నామని, అన్ని ప్రాంతాల్లోనూ బలగాలు మోహరించే ఉన్నాయని తెలిపారు. వైమానిక ద‌ళ చీఫ్ మార్ష‌ల్ ఆర్‌కేఎస్ భ‌దౌరియా ఇవాళ మీడియాతో మాట్లాడారు. యుద్ధ‌ప‌రంగా మ‌న ద‌ళాలు సంసిద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. చైనా కంటే భారత్ ఎందులోనూ తక్కువగా లేదని, భారత బలగాలు అన్ని రంగాల్లోనూ సర్వ సన్నద్ధంగానే ఉన్నాయని వెల్లడించారు. భ‌విష్యుత్తులో ఎటువంటి యుద్ధం వ‌చ్చినా.. దాంట్లో విజ‌యం సాధించే రీతిలో మ‌న ద‌ళాలు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. నేను మీతో న‌మ్మ‌కంగా ఒక మాట చెప్పాల‌నుకుంటున్నాన‌ని, మ‌న ద‌ళాలు ఉత్తమంగా ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అన్ని కీల‌క ప్రాంతాల్లో ద‌ళాల‌ను మోహ‌రించామ‌ని, ల‌డాఖ్ అనేది చిన్న భాగ‌మ‌న్నారు. యుద్ధ విమానాలైన రాఫేల్స్‌, చినూక్‌లు, అపాచీలను అతి త‌క్కువ స‌మ‌యంలో ఆప‌రేట్ చేశామ‌ని, రానున్న మూడేళ్ల‌లో రాఫేల్స్‌, ఎల్‌సీఏ మార్క్ 1 స్క్వాడ్ర‌న్లు పూర్తి సామ‌ర్థ్యంతో ప‌నిచేయనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుతం ఉన్న వైమానిక శ‌క్తికి మిగ్‌-29 తోడ్పాటు ఉంటుంద‌న్నారు.

స‌మ‌ర సామ‌ర్ధ్యాన్ని, విశ్వ‌స‌నీయ‌త‌ను పెంచ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని, ఆధునీక‌ర‌ణ‌, ఆప‌రేష‌న‌ల్ ట్రైనింగ్‌, స్వ‌దేశీ ఆయుధాల వినియోగాన్ని పెంచ‌డం వంటి అంశాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ భ‌దౌరియా తెలిపారు. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ విమానాల‌పై న‌మ్మ‌కాన్ని పెంచుకున్నామ‌ని, రానున్న అయిదేళ్ల‌లో మ‌రో 83 ఎల్‌సీఏ మార్క్ 1 విమానాల‌కు ఆర్డ‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. స్వ‌దేశీ ఉత్ప‌త్తిలో డీఆర్‌డీవో, హెచ్ఏఎల్‌కు స‌పోర్ట్ ఇస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. హెచ్‌టీటీ40, లైట్ కంబాట్ హెలికాప్ట‌ర్ల‌కు సంబంధించి త్వ‌ర‌లో ఒప్పందం చేసుకోనున్న‌ట్లు తెలిపారు.
న సామర్థ్యాలు శత్రువులనే ఆశ్చర్యానికి గురి చేశాయి. రాఫెల్ రావడం చాలా కలిసొచ్చే అంశం. దేశం చాలా సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. అయినా సరే.. ఈ పరిస్థితులు వాయు సేన సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి.’’ అని బధూరియా ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.