ఛార్మి తల్లిదండ్రులకు కరోనా!

టాలీవుడ్ నటి ఛార్మీ కౌర్ తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని నటి ఛార్మి స్వయంగా ఇన్స్టాగ్రామ్ లో పోస్టు ద్వారా తెలియజేసింది. ఇప్పుడు వారు హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఇటీవలి హైదరాబాద్ వరదలు, ఇతర పరిస్థితుల కారణంగా వారు కరోనా బారిన పడినట్టు ఛార్మి తెలిపింది. ప్రస్తుతం వారు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, చికిత్సకు బాగానే స్పందిస్తున్నారని పేర్కొంది. తన తల్లిదండ్రులను తిరిగి ఆరోగ్యవంతులుగా చూసేందుకు ఎదురు చూస్తున్నానని సోషల్ మీడియా పోస్టులో తెలిపింది.