జలమండలిలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవిర్భావ వేడుకలు

హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వేడుకల్లో జలమండలి ఎండీ ఎం. దానకిషోర్, ఐఏఎస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండీ దానకిషోర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జలమండలి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, వినియోగదారులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కొవిడ్-19 నిబంధలను అనుసరిస్తూ ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో జలమండలి ఎగ్జిజక్యూటివ్ డైరెక్టర్ డా. ఎం. సత్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి, ఫైనాన్స్ డైరెక్టర్ వాసుదేవనాయుడు, పర్సనల్ డైరెక్టర్ డి. శ్రీధర్ బాబు, రెవెన్యూ డైరెక్టర్ వి. ఎల్. ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ పి. రవి కుమార్ లతో సీజీఎంలు పాల్గొన్నారు.