జలమండలిలో 18 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ కరోనా వాక్సిన్

హైదరాబాద్‌ (CLiC2NEWS): జలమండలిలో పనిచేస్తున్న 18 ఏళ్లకు పైబడిన ఉద్యోగులంద‌రికి ఇవాళ, రేపు వ్యాక్సినేష‌న్ ఇవ్వ‌నున్నారు. ఈ మేర‌కు జలమండలి పారిశుధ్య సిబ్బందితో సహా, 18 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ వంద శాతం వాక్సినేషన్ చేయిస్తామని జలమండలి ఎండీ ఎం. దాన కిషోర్ పేర్కొన్నారు. మంత్రి కెటిఆర్ సూచనల మేరకు వాక్సినేష‌న్ చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేర‌కు 18 ఏళ్లకు పైబడిన వారందరికీ రెండవ విడతలో మొదటి డోసు వాక్సినేషన్ లో భాగంగా బుధ‌వారం గోషామహల్ లోని సర్కిల్ ఆఫీసులో పర్సనల్ డైరెక్టర్ డి. శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఈ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ ప్రక్రియలో భాగంగా.. నేడు జలమండలిలో పనిచేస్తున్న 18 ఏళ్లకు పైబడిన వారికి మొత్తం 780 మంది ఉద్యోగులకు హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారుల సహకారంతో, గోషామహల్ లో ఉన్న జలమండలి డిస్పెన్సరీ లో ఈ వాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ వాక్సినేషన్ కార్యక్రమం గురువారం కూడా కొనసాగుతుందని పర్సనల్ డైరెక్టర్ శ్రీధర్ బాబు తెలిపారు. ఇప్పటికే మొదటి విడత లో 45 ఏళ్లకు పైబడిన వారికి ఈ వాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసిన విషయం తెలిసిందే. వీరికి తగిన నిర్ణీత కాలంలో రెండవ డోసు కూడా వేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీజీఎం (పి&ఏ) అబ్దుల్ ఖాదర్, జనరల్ మేనేజర్ ( పి & ఏ) సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.