జిమ్‌లో చెమ‌టోడుస్తున్న లావ‌ణ్య‌ త్రిపాఠి

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి.. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. లాక్ డౌన్ టైంలో మంచి ఆహారం తీసుకుంటూ తీరిక‌గా గ‌డిపిన ఈ భామ ఇపుడు స్లిమ్ గా త‌యార‌యేందుకు జిమ్ కు వెళ్ల‌డం షురూ చేసింది. జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్న వీడియోలను, ఫొటోలను షేర్‌ చేసి.. స్లిమ్‌గా ఉండాలంటే వర్కవుట్స్‌ చేయాల్సిందే అంటూ చెబుతుంటుంది. తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో.. తన ఫిజికల్‌ ట్రైనర్‌ సమక్షంలో వర్కవుట్స్‌ చేస్తున్న ఫొటోలను అలాగే ఓ వీడియోను షేర్‌ చేసింది.

“మనం ఈ రోజు ఎంత కష్టపడితే ఎంత బాధను అనుభవిస్తే రేపు అంతగా ప్రతిఫలిం వస్తుంది“ అని చెబుతూ జిమ్‌లొ ఎలా కష్టపడుతున్నానో తెలిపే ఓ వీడియోను షేర్ చేసింది. లావ‌ణ్య ప్ర‌స్తుతం సందీప్ కిష‌న్ తో క‌లిసి ఏ 1 ఎక్స్ ప్రెస్ సినిమాతో పాటు కార్తికేయ న‌టిస్తున్న చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రంలో హీరోయిన్ గా క‌నిపించ‌నుంది.

Leave A Reply

Your email address will not be published.