జీనోమ్‌వ్యాలీలో ప్రధాని మోదీ.. కొవిడ్‌ టీకాపై సమీక్ష

హైదరాబాద్‌ : క‌రోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై స‌మీక్షించేందుకు మూడు న‌గ‌రాల ప‌ర్య‌ట‌నలో భాగంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శ‌నివారం హైద‌రాబాద్ విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా జినోమ్‌వ్యాలీలో గ‌ల భార‌త్ బ‌యోటెక్‌ను సంద‌ర్శించి `కొవాగ్జిన్‌` టీకా అభివృద్ధిపై శాస్త్ర‌వేత్త‌ల‌తో చ‌ర్చించారు. కొవాగ్జిన్ టీకాపై ప్ర‌స్తుతం మూడో ద‌శ క్లినిక‌ల్ ప్ర‌యోగాలు జ‌రుగుతున్న విషయం తెలిసిందే `కొవాగ్జిన్‌` తాజా ప‌రిస్థితిపై భార‌త్ బ‌యోటెక్ యాజ‌మాన్యం, శాస్త్ర‌వేత్లు ప్ర‌ధాని వివ‌రించారు.

అంత‌కు ముందు హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ సోమేశ్‌కుమార్‌, కలెక్టర్‌ శ్వేతా మొహంతితో పాటు పలువురు అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా జీనోమ్‌వ్యాలీకి చేరుకున్నారు.

అనంతరం 2.15 గంటలకు భారత్‌ బయోటెక్‌ నుంచి బయలుదేరి.. 2.40 గంటలకు హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. 3.50గంటలకు ఇక్కడి నుంచి పూణేకు బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రత దృష్ట్యా రాజీవ్‌ రహదారిపై హైదరాబాద్‌ – కరీంనగర్‌ రూట్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

 

Leave A Reply

Your email address will not be published.