జీపును ఢీ కొన్న ట్రక్కు: 8 మంది మృతి
జైపూర్: రాజస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. జైపూర్ సమీపంలోని జీపును ఓ ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం.. రాజస్థాన్‌లోని ప్రముఖ ఆలయం ఖాటూశ్యామ్ జీ దర్శనం చేసుకుని స్వస్థలానికి తిరుగివెళ్తున్నారు. ఈ క్రమంలో జైపూర్ సమీపంలోని టోంక్ వద్ద వారు ప్రయాణిస్తున్న జీపును ట్రక్కు ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ఎనిమిది మంది మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.