టాలెంట్: లఘుచిత్రాల ఆశా’కిరణం’

తెలంగాణలో చాలా మంది కుర్రాళ్లకు మంచి సృజనాత్మకత ఉంటుంది. కానీ ఆర్తిగ స్థిరత్వం లేక, ప్రోత్సహించే వారు లేక అన్నింటిలోనూ వెనుకంజ వేస్తున్నారు. కానీ తెలంగాణ ఆవిర్భావం తరువాత పురివిప్పిన నెమలిలా, స్వేచ్ఛా విహంగాల్లా తమ ప్రతిభను చాటుకుంటున్నారు.. కానీ చాలా మందికి ప్రచారం లభించడం లేదు.. ఈ నేపథ్యం లో ఒక్కొక్కరిని వెలుగులోకి తెచ్చి మీకు పరిచయం చేయాలన్న లక్ష్యం తో ఇది ప్రారంభిస్తున్నాం.
ఈ రోజు రామ్ కిరణ్ ను మీకు పరిచయం చేస్తున్నాం.. చిన్నప్పుడే తల్లి చనిపోయింది.. తండ్రి అన్నీ తానై పెంచాడు. పేరు గోపాల్ రెడ్డి.. ఆయనకూ చిన్నప్పుడే పోలియో రావడం వాలన సరిగా నడవలేక పోయాడు.. హైదరాబాద్ సిటీ కళాశాలలో డిగ్రీ చేసిన తరువాత వికలాంగుల సంక్షేమ శాఖలో ఉద్యోగం లో చేరాడు. పెళ్లి తరువాత పాప, బాబు పుట్టాక అర్ధాంగి కన్ను మూసింది. అయినా ఏ లోటూ లేకుండా పిల్లలను చదివించి పెద్ద చేశారు. కూతురు పెళ్లి అయింది . కొడుకు రామ్ కిరణ్ బి. టెక్ చేసి స్థిర పడే సమయం లో గోపాల్ రెడ్డి కన్ను మూసారు.. రామ్ కిరణ్ కు షార్ట్ ఫిలింలు నిర్మించడం చాల ఇష్టం. బి. టెక్ చేస్తున్న సమయం లోనే బధిరుల కోసం ఒక షార్ట్ ఫిలిం నిర్మించాడు. దానికి ఎన్నెన్నో అవార్డు లు లభించాయి.. ఏమాత్రం డబ్బు పెట్టకుండా నాలుగు షార్ట్ ఫిలిం లను నిర్మించి అందరి మెప్పును పొందారు. 2014 లో స్నేహితుల సహకారం తో మరి కొన్ని షార్ట్ ఫిలిం లు నిర్మించాడు. కానీ డబ్బుకు ఇబ్బంది కావడం తో బెంగుళూరు వెళ్లి రెండేళ్లు ఉద్యోగం చేసాడు. కానీ మనసంతా షార్ట్ ఫిలిం నిర్మాణాల పైనే.. ఫలితంగా రెండేళ్ల తరువాత ఉద్యోగం వదిలేసి మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నాడు. 2017 తరువాత సుమారు నూటికి పైగా షార్ట్ ఫిలిం లను ఎడిటింగ్ డబ్బింగ్, డిజైనింగ్ వంటి పనులు స్వయంగా చేపట్టాడు.

 

2017 లో తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన 48 గంటల ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొని. తన ప్రతిభకు రెండు అవార్డులు, ఫిలిం కు రెండు అవార్డులు అందుకున్నాడు. ఇటీవల తపస్వి లఘు చిత్రానికి పని చేసాడు అందులో తనికెళ్ళ భరణి ప్రధాన పాత్ర పోషించాడు. ఇది ఎంతోమంది ఆదరణను చూరగొన్నది. ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ ప్రారంభిద్దామని ఆలోచిస్తున్నాడు దర్శకత్వం, స్క్రిప్ట్, పూర్తి చేసుకున్నాడు.. మంచి ప్రొడ్యూసర్ కోసం నిరీక్షిస్తున్నారు.. ఏదెలా వున్నా తన లక్ష్యం చేరుకుంటానని.తెలంగాణ పేరు ప్రపంచానికి చాటి చెబుతానని. రామ్ కిరణ్ అంటున్నాడు. అల్ ది బెస్ట్ రామ్ కిరణ్.

                                                                                                                                                         -టి. వేదాంత సూరి

Leave A Reply

Your email address will not be published.