టి. వేదాంత సూరి: ఆక్లాండ్ లో దీవాలి వేడుకలు
ప్రతి ఏటా ఆక్లాండ్ లో దీపావళి వేడుకలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ తరాన రేడియో వారి నేతృత్వం లో ఇవి జరుగుతుంటాయి. ఇది భారతీయులది. అక్కడి వార్తలు, సంగీతం , పాటలు ఇందులో ప్రసారం చేస్తుంటారు. భారతీయులంతా ఈ రేడియో శ్రోతలే. వారు కొందరు స్పాన్సర్లు కలిసి అక్టోబర్ 27 నుంచి నవంబర్ 14 వరకు వివిధ ప్రాంతాలలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇటీవల స్థానిక వోడాఫోన్ గ్రౌండ్స్ లో ఉదయం నుంచి రాత్రి వరకు వేడుకలు జరిగాయి. అందులో పంజాబ్, కేరళ, కాశ్మీర్ నృత్యాలతో పాటు తెలంగాణా సంస్కృతికి ప్రతీకగా బతుకమ్మ ను కూడా న్యూజిలాండ్ జాగృతి విభాగం అద్వర్యం లో పాల్గొన్నారు. స్థానిక ప్రముఖులు పాల్గొని భారతీయులను అభినందించారు చీకటి ని జయించి వెలుగు వచ్చిన రోజు దీపావళి అని కరోనాను జయించి విజయోత్సవాలు మనం జరుపుకుంటున్నామని వక్తలు పేర్కొనడం విశేషం. కరోనా ప్రభావం అంతగా లేక పోవడం వలన ఇక్కడికి భారతీయులంతా చేరి ఆనందంగా గడిపారు. భారతీయుల ఇల్లు విద్యుత్ దీపాలతో వెలిగి పోతున్నాయి.
-టి.వేదాంత సూరి