టి. వేదాంత సూరి : ప్రపంచానికే పర్యాటక కేంద్రం న్యూజిలాండ్
ఆక్లాండ్: న్యూజిలాండ్ ఇది ప్రపంచానికే పర్యాటక కేంద్రం. అన్ని దేశాల వారు ఇక్కడ వుంటారు. అంతే కాదు అన్ని దేశాల వారిని దృష్టిలో పెట్టుకుని సౌకర్యాలు కూడా అదే విధంగా కల్పిస్తారు.. భిన్నత్వం లో ఏకత్వం అన్నట్టుగా దేశాలు వేరైనా మనుషులంతా ఒక్కటే కదా. కరోనా ప్రభావం వలన పర్యాటకుల సంఖ్య తగ్గింది.. దేనితో దేశ ఆదాయ వనరులు కూడా తగ్గాయి.. చాలా మంది ఉద్యోగాలు పోయాయి. వారిని ప్రబభుత్వం ఆదుకుంటూనే వుంది.. ఇక్కడి ఉద్యోగుల్లో బాధ్యత ప్రస్ఫూటంగా కనిపిస్తుంది. ఉదాహరణకు ఇళ్లల్లో, ఫుట్ పాత్ లపై గడ్డిని శుభ్రం చేసే వారు తమ విధుల ప్రకారం వచ్చి తమ పని తాము చేసుకుంటూ పోతారు.. ప్రతి వారం డస్ట్ బిన్ లో వున్న చెత్త ను తీసుకు పోతారు. సమయాన్నిచాలా సమర్ధవంతంగా ఉపయోగించు కుంటారు. అంతే కాదు.. యెంత మిత్రులైనా అనుమతి తీసుకుని సమయం తీసుకుని ఆ సమయానికే వస్తారు.. ఇక బయట వాకింగ్ చేస్తుంటే ఎవరు కనిపించినా. నవ్వుతూ హాయ్ చెబుతారు.. పరిచయం అవసరం లేదు.. మనం మనుషులం కదా. అన్నట్టుగా ఉంటుంది.. ప్రతి ఉద్యోగి వేతనం లో నుంచి 40 శాతం వృత్తి పన్ను చెల్లిస్తారు.. దానితోనే అభువృద్ధి పనులు చేపడుతారు.. అంతే కాకుండా ఉద్యోగుల ఆరోగ్యం, అవసరాలు.. అన్ని ప్రభుత్వమే స్వీకరిస్తుంది.. పదవీ విరమణ తరువాత కూడా అన్ని బాధ్యతలు ప్రభుత్వానివే. ఎక్కడా అవినీతి వుండదు.. ఎవరి పనులు వారు సమర్థవంతంగా చేసుకుంటూ పోతారు.. ఉద్యోగాల తార తమ్యాలూ వుండవు.. కార్ డ్రైవర్, ఇంజనీర్, డాక్టర్, అందరిదీ ఒకే హోదా. ఎం. పి లు, ప్రధాని కూడా సాధారణంగా అందరితో కలివిడిగా వుంటారు.. ఎన్నికల సమయం లో ప్రచార హోరు అసలే ఉండదు. రోడ్ల పైన హోర్డింగులు మాత్రమే ఉంటాయి.. అందరూ విద్యావంతులే. తమకు నచ్చిన వారిని ఎన్నుకుంటారు.. అక్టోబర్ లో ఇక్కడ ఎన్నికలు వున్నాయి.. సాధారణంగా సెప్టెంబర్ లో ఉండాలి. కానీ కరోనా వలన నెల రోజులు వాయిదా వేసుకున్నారు.. ప్రస్తుతం ఆక్లాండ్ లో మాత్రం లాక్ డౌన్ కోన సాగుతుంది.. కానీ ఎవరూ భయపడవలసిన పరిస్థితులు లేవు..
– టి. వేదాంత సూరి