టీమిండియా టెస్ట్ జట్టులో పాండ్యా కీలకం : సెహ్వాగ్
ఢిల్లీ: ఇండియన్ క్రికెట్ టీంలో హార్దిక్ పాండ్యా అత్యంత కీలక ఆటగాడు.. అని ఇండియన్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. అయితే ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న భారత్ టీ20 సిరీస్ విజయం సాధించడంలో పాండ్యా ముఖ్య పాత్ర పోషించాడు. అలాగే అంతకముందు భారత్ కోల్పోయిన వన్డే సిరీస్ లో కూడా పాండ్యా బ్యాట్ తో చెలరేగిపోయాడు. మొత్తం మూడు వన్డేల్లో 210 పరుగులు చేసిన పాండ్యా మూడు టీ20 ల్లో 78 పరుగులు చేశాడు. మొత్తం ఈ ఆరు మ్యాచ్ లలో రెండుసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అయితే ఈ భారత పర్యటనలో పాండ్యా కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు మాత్రమే పరిమితం అయ్యాడు. అతడిని టెస్ట్ జట్టులోకి ఎన్నుకోలేదు. ఈ విషయం పై సెహ్వాగ్ స్పందిస్తూ… ఈ పర్యటనలో బౌలింగ్ చేయడానికి ఫిట్‌గా ఉంటే హార్దిక్ పాండ్యా టెస్ట్ జట్టులో కూడా ఉండేవాడు అని అన్నారు. అతను బౌలింగ్ చేయడానికి ఫిట్ కానంతవరకు తనను టెస్ట్ మ్యాచ్‌లకు ఎంపిక చేయకండి అని హార్దిక్ పాండ్యా సెలెక్టర్లకు చెప్పి ఉండవచ్చు అని వీరేందర్ సెహ్వాగ్ అన్నారు. కానీ అతను బౌలింగ్ చేయడం ప్రారంభిస్తే ఎటువంటి సందేహం లేదు, అతను టెస్ట్ జట్టులో కీలకమైన ఆటగాడు అవుతాడు అని పేర్కొన్నాడు.