టెన్త్ అర్హతతో రైల్వేలో 480 అప్రెంటిస్‌లు

న్యూఢిల్లీ: ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో ఉత్తర మధ్య రైల్వేలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న480 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఇండియన్‌ రైల్వే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులని వెల్లడించింది. ఇందులో ఫిట్టర్‌, వెల్డర్‌, మెకానిక్‌, కార్పెంటర్‌, ఎలక్ట్రిషన్‌ పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చేనెల 16 వరకు అందుబాటులో ఉంటాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

మొత్తం పోస్టులు: 480

  • ఫిట్టర్‌ 286
  • వెల్డర్‌ 11
  • మెకానిక్‌ (డీజిల్‌) 84
  • కార్పెంటర్‌ 11
  • ఎలక్ట్రిషన్‌ 88 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: పదో తరగతిలో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి, 15 నుంచి 24 ఏండ్ల లోపువారై ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్ట్‌ చేసిన అభ్యర్థులను ట్రైనింగ్‌కు ఎంపికచేస్తారు.

అప్లికేషన్‌ ఫీజు: రూ.170, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.70

దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్‌ 16

వెబ్‌సైట్‌: www.ncr.indianrailway.gov.in

Leave A Reply

Your email address will not be published.