ట్యాంక్‌బండ్‌పై రేపు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బుధవారం ట్యాంక్‌బండ్‌పై పోలీసు శాఖ ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. లిబర్టీ జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వైపు వాహనాదారులు ఎవరూ రావద్దని పోలీసులు సూచించింది. అప్పర్ ట్యాంక్‌బండ్ నుంచి వచ్చే వాహనాలకు లిబర్టీ వైపు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అప్పర్ ట్యాంక్‌బండ్ నుంచి వచ్చే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లించనున్నారు.