తెలంగాణతో కొత్తగా 2157 కరోనా కేసులు.. 8 మంది మృతి
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 72,364 కరోనా టెస్టులు నిర్వహించగా 2157 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలోఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,34,738కి చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారి నుంచి 821 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 3,07,499 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,459 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న ఎనిమిది మంది కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1780కి చేరిందని అధికారులు పేర్కొన్నారు. జిహెచ్ ఎంసి పరిధిలో 361 కేసులు నమోదయ్యాయి.