ట్రంప్ దంప‌తుల‌కు క‌రోనా పాజిటివ్‌

వాషింగ్ట‌న్‌‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ఆయ‌న భార్య మిలానియా ట్రంప్‌ల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ట్రంప్ స‌ల‌హాదారుల్లో ఒక‌రికి క‌రోనా సోక‌డంతో వీరు పరీక్ష‌లు చేయించుకున్నారు. దాంతో తాము క్వారంటైన్‌లోకి వెళ్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని కాసేప‌టి క్రితం ట్రంప్ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. త‌క్ష‌ణ‌మే రిక‌వ‌రీ ప్ర‌క్రియ‌ను కూడా ప్రారంభించ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. వైర‌స్ బారి నుంచి త్వ‌ర‌లోనే విముక్తి చెందుతామ‌ని కూడా ట్రంప్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో అధ్య‌క్ష భ‌వ‌నంలోని సిబ్బంది మొత్తం అప్ర‌మ‌త్త‌మైంది.

అర్థ‌రాత్రి ఒంటి గంట స‌మ‌యంలో వైట్‌హౌజ్ రిపోర్ట‌ర్ల‌కు ట్రంప్ క‌రోనా రిపోర్ట్‌ను వెల్ల‌డించారు. అధ్య‌క్షుడు ట్రంప్ వ‌ద్ద ఫిజీషియ‌న్‌గా చేస్తున్న నావీ క‌మాండ‌ర్ డాక్ట‌ర్ సీన్ కాన్లే ఈ విష‌యాన్ని ద్రువీక‌రించారు. గురువారం సాయంత్రం త‌న‌కు పాజిటివ్ టెస్ట్ ఫ‌లితాలు వ‌చ్చిన‌ట్లు డాక్ట‌ర్ తెలిపారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రూ క్షేమంగా ఉన్నార‌ని, వైట్‌హౌజ్‌లోనే ఉండేందుకు వాళ్లు ఇష్ట‌ప‌డుతున్నార‌ని కాన్లే తెలిపారు. త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు ముందు ట్రంప్‌కు క‌రోనా సోక‌డం కొంత ఇబ్బందిక‌ర‌మే. న‌వంబ‌ర్ 3వ తేదీన అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ట్రంప్ ప్ర‌చారానికి బ్రేక్ ప‌డిన‌ట్లు భావిస్తున్నారు. ట్రంప్‌కు క‌రోనా రావ‌డంతో అమెరికా ఎ్న‌క‌ల‌పై ప్ర‌పంచం అంతా ఉత్కంఠ‌గా చూస్తోంది ఏమి జరుగుతుందో అని!

 

 

Leave A Reply

Your email address will not be published.