ఢిల్లీలో పాఠశాలలు సోమవారం నుంచే..

న్యూఢిల్లీ: దేశరాజధాని హస్తినలో సోమవారం నుంచి స్కూళ్లను ఓపెన్ అవుతున్నాయి. 10, 12వ తరగతుల విద్యార్థులకు స్కూల్ పాఠాలు స్టార్ట్ కానున్నాయి. అయితే భౌతికంగా హాజరు కావాలన్న అంశాన్ని విద్యార్థులకే వదిలేశారు. ప్రీ బోర్డు ప్రిపరేషన్, ప్రాక్టికల్ వర్క్‌లను దృష్టిలో పెట్టుకుని జనవరి 18వ తేదీ నుంచి విద్యార్థులు స్కూళ్లకు హాజరుకావాలని ప్రభుత్వం పేర్కొన్నది. తల్లితండ్రుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే విద్యార్థులు స్కూళ్లకు రావాలంటూ కేజ్రీవాల్ సర్కార్ ఇచ్చిన ఆదేశాల్లో తెలిపింది.