ఢిల్లీలో మరో రికార్డు

న్యూఢిల్లీ: ఒక వైపు కరోనా ఉధృతి.. మరో వైపు ఎముకలు కొరికే చలి.. ప్రస్తుతం ఢిల్లీ ప్రజలను ఈ రెండు వణికిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో మరో రికార్డు నమోదయింది. ఢిల్లో రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తోంది. కరోనా, గాలి కాలుష్యంటూ ఎప్పుడూ ఎందులో ఒకదానిలో రికార్డు చేసి వార్తల్లో నిలుస్తుంది. అయితే ఈ సారి కాస్త కొత్తగా చలిలో రికార్డ్ చేసింది. అదెలా అనుకుంటున్నారు.. గత 14 సంవత్సరాల కాలంలో అత్యంత తక్కువ టెంపరేచర్‌ని నమోదు చేసి ఈ రికార్డును గెలిచింది. అంతేకాకుండా ఈ రోజు ఉదయానికి కోల్డెస్ట్ మార్నింగ్ అంటూ పేరు పెట్టింది. అయితే ఈరోజు అక్కడ నమోదయిన ఉష్ణోగ్రత కేవలం 7.5 డిగ్రీలు దీని గత14 సంవత్సరాలుగా ఏ నవంబరులోనూ నమోదు కాలేదు. అయితే భారతీయ మీటియోరోలాజికల్ డిపార్టిమెంట్ ప్రకారం ఇప్పటివరకు నవంబరులో నమోదయిన అతితక్కువ ఉష్ణోగ్రత గతేడాది 11.5 డిగ్రీలు అయితే దానిని తక్కువ చేసేలా 7.5 డిగ్రీలు నమోదయింది. అంతేకాకుండా ఢిల్లీలో 2018 నవంబరులో 10.5 డిగ్రీలు, 2017 నవంబరులో 7.6 డిగ్రీలు నమోదయినట్లు తెలిపారు.