తండ్రిని చంపి ఇంట్లోనే కూర్చున్న కొడుకు

శంక‌ర్‌ప‌ల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక శ్రీరాంనగర్ కాలనీలో తండ్రి అంజయ్యను చంపి కుమారుడు యాదయ్య కత్తితో ఇంట్లోనే తిరుగుతున్నాడు. చుట్టుపక్కల వాళ్లు ఫొటోలు తీస్తున్నారని లైట్లు ఆర్పి ఇంట్లోనే కూర్చున్నాడు. యాదయ్య మానసిక స్థితి సరిగాలేదని స్థానికులు అంటున్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి మండల కేంద్రంలోని శ్రీరాం నగర్ కాలనీలో నివాసముంటున్న యాదయ్య అనే వ్యక్తి కన్న తండ్రిని దారుణంగా హత్య చేశాడు. తండ్రి అంజ‌య్య‌ను చంపి కత్తితో ఇంట్లోనే తిరుగుతున్నాడు. విషయం తెలుసుకున్న శంకర్‌పల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అతణ్ని బయటికి రప్పించేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆ ఇంటికి మీడియా ప్రతినిధులు, స్థానికులు చేరుకోవడంతో నిందితుణ్ని కిటికీల్లో నుంచి ఫోటోలు వీడియోలు తీశారు.

దీంతో ఇది గమనించిన నిందితుడు ఇంట్లో లైట్లు ఆర్పేసి కూర్చున్నాడు. ఎవ‌రూ లోప‌ల‌కు రాకుండా  గడియ పెట్టుకున్నాడు. కిటికీలు తొలగించి పోలీసులు చివరకు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు విచారణ జరిపారు. కొడుకు మానసిక స్థితి సరిగ్గా ఉండదని స్థానికులు చెప్పారు. కాగా కన్న తండ్రిని హత్య ఎందుకు చేయాల్సి వచ్చిందన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘ‌ట‌న‌తో ఆ ప్రాంతమంతా కలకలం రేగింది.

 

 

Leave A Reply

Your email address will not be published.