తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు
ఆగ్రా: ప్రపంచంలోని ఏడు అద్భుతాల్లో ఒకటైన ఆగ్రాలోని తాజ్ మహల్‌కు గురువారం ఉదయం బాంబు బెదింపు వచ్చింది. ఫోన్‌కాల్ వచ్చిన వెంటనే అప్రమత్తమైన పోలీస్ అధికారులు తాజ్ మహల్ రెండు ద్వారాలను మూసివేశారు. పర్యాటకులను బయటకు పంపి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్లో పోలీస్‌లకు ఫోన్ చేసి ప్రేమసౌధంలో పేలుడు పదార్థాలు ఉంచినట్లు సమాచారం అందించాడు. బాంబు బెదిరింపు నేపథ్యంలో తాజ్ మహల్లో సీఐఎస్ఎఫ్, స్థానిక బలగాలను మోహరించారు. ఒక్కసారిగా బాంబు బెదింపు రావడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎవరు ఫోన్ చేశారు.. ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.