తిరుపతి రూట్ లో 18 రైళ్లు తాత్కాలికంగా రద్దు
సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంతకల్లు డివిజన్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల కారణంగా తిరుపతి మార్గంలో 18 రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేశారు. గుంతకల్లు రూట్ లో మరమ్మతులు, ఎలక్ర్టిఫికేషన్, మోడలింగ్ వంటి అభివృద్ధి పనుల ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రైళ్లు వారంరోజులు, మరికొన్ని రెండు రోజులు.. మరమ్మతుల అవసరాన్ని బట్టి రద్దుచేశారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే యథావిధిగా నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.