తిరుపతి, సాగర్ ఉప ఎన్నికలకు షెడ్యూల్
ఏప్రిల్ 17న పోలింగ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి)విడుదల చేసింది. 2 లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనుంది. ఎపిలోని తిరుపతి లోక్‌సభకు, తెలంగాణలోని నాగార్జున సాగర్ స్థానానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల (మార్చి) 23న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఇసి వెల్లడించింది. మార్చి 30 వరకు నామినేషన్ల దాఖలుకు ఇసి గడువు విధించింది. 31న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. 17న ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
కాగా వైసీపీ ఎంపి దుర్గాప్రసాద్ మృతితో తిరుపతిలో అలాగే టిఆర్ ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో నాగార్జునసాగర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
