తెలంగాణలో కొత్తగా 2,214 కరోనా కేసులు
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ని్న రాత్రి 8 గంటల వరకు 54443 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2214 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,93,600కు చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ గురువారం బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో1,93,600 కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, వైరస్ ప్రభావంతో ఇవాళ ఎనిమిది మంది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 1,135కు చేరింది. ఇవాళ 2,474 మంది వైరస్ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం1,63,407 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 29,058 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 23,702 మంది హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాలు 0.58 శాతంగా ఉండగా రికవరీ రేటు 84.40 శాతంగా ఉందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 54,443 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 30,50,444 పూర్తి చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వివరించింది. 24 గంటల్లో నమోదైన కేసుల్లో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 305 నమోదయ్యాయి.