తెలంగాణలో కొత్తగా 965 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ‌లో గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 965 కొవిడ్ పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు శుక్ర‌వారం ఉద‌యం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజాగా రాష్ట్రంలో ఐదు మరణాలు నమోదయ్యాయి. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1,706కు పెరిగింది. కాగా తాజాగా మరో 312 మంది బాధితులు కోలుకొని హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 6,159 యాక్టివ్‌ కేసులున్నాయి.. వాటిలో ప్రసుతం హోం ఐసోలేషన్‌లో 2,622 మంది బాధితులున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో 254 కేసులు జీహెచ్‌ఎంసీలోనే ఉన్నాయి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,09,741కి చేరాయ‌ని అధికారులు తెలిపారు. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నది. ఇప్పటికే మాస్క్ ను తప్పనిసరి చేసింది.

Leave A Reply

Your email address will not be published.