తెలంగాణలో కొత్తగా 143 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 143 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే తాజాగా కరోనాతో చికిత్ప పొందుతూ ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం బులిటెన్ విడుదల చేసింది. అలాగే తాజాగా కరోనాతో చికిత్ప పొందుతూ 152 మంది బాధితులు పూర్తి స్థాయిలో కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,277కు చేరుకోగా.. రికవరీ కేసుల సంఖ్య 2,92,848కు పెరిగింది. అలాగే కరోనాబారిన పడి మృతిచెందినవారి సంఖ్య 1614కు చేరిందని అధికారులు పేర్కొన్నారు.