తెలంగాణలో కొత్తగా 147 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 147 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్కరు మృతి చెందారు. ఇదే సమయంలో 399 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 2,93,737 కు చేరింది. కాగా ఇప్పటి వరకు 1,593 మంది కరోనాతో మృతి చెందారు. అలాగే 2,89,325 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,819 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో 1,295 హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.