తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 157 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కొత్తగా కోవిడ్‌తో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు సోమవారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా 166 మంది కోవిడ్ బాధితులు పూర్తి స్థాయిలో కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,01,318కు చేరింది. అలాగే రికవరీ కేసుల సంఖ్య 2,97,681కు చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 1,654కు చేరింది. కాగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,983 యాక్టివ్ కేపసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.