తెలంగాణలో కొత్తగా 170 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గడచిని 24 గంటల వ్యవధిలో కొత్తగా 170 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,99,742కి చేరింది. ఇందులో 2,96,166 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1936 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా ఒకరు కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1640కి చేరిందని అధికారులు వెల్లడించారు.