తెలంగాణలో కొత్తగా 178 కరోనా కేసులు
హైదరాబాద్: కొన్ని రోజులుగా నిలిపివేసిన కరోనా బులెటిన్ ను శనివారం తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 40,821 శాంపిల్స్ పరీక్షించగా 178 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,98,631 కు చేరింది. తాజాగా 148 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,95,059 మంది రికవరీ అయ్యారు. గత 24 గంటల్లో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణంతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,633 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రస్తుతం 939 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.