తెలంగాణలో కొత్తగా 194 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 194 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,536 కు చేరుకుంది. అలాగే తాజాగా ముగ్గురు కరోనాతో మృతిచెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 1,649 మంది కన్నుమూశారు. తాజాగా 116 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రికవరీ కేసులు 2,97,032 కు పెరిగాయి.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,855 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.